హరితహారంలో భాగస్వాములు కావాలి : జేసీ

Sun,August 11, 2019 04:22 AM

రఘునాథపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ ఓజే మధు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని బాలికల డిగ్రీ కళాశాల ఆవరణలో శనివారం విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటి, సంరక్షించుకోవాల్సి బాధ్యత ప్రతీ కుటుంబంపై ఉందన్నారు. రైతులు విరివిగా పొలం గట్లపై ఆదాయాన్నిచ్చే టేకు మొక్కలు నాటుకోవాలని సూచించారు. మండలంలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృక్షాలను విచ్చలవిడిగా నరికివేస్తుండడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏటేటా వర్షాలు తగ్గిపోతున్నాయన్నారు.

నాటిన మొక్కలను భావితరానికి అందించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. విద్యార్థులు తమ పుట్టిన రోజును పురస్కరించుకుని మొక్కలు నాటి సంరక్షించుకోవాలని, ఇది ప్రతీ విద్యార్థి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హరిప్రసాద్, రంగు రవీందర్, భాస్కర్, వెంకటస్వామి, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles