ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక

Sat,August 10, 2019 03:55 AM

కొడకండ్ల ఆగస్టు 09 : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు శుక్రవారం మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కుందూరి వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రామ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. లక్ష్మక్కపల్లిలో గ్రామ అధ్యక్షుడిగా కాటూరి కృష్ణమూర్తి, ప్రధాన కార్యాదర్శిగా నర్ర సత్యనారాయణ, బోడోనికుంట తండాలో గ్రామంలో పార్టీ గ్రామ అధ్యక్షుడుగా బానోత్ సోమ్లా, ప్రధాన కార్యదర్శిగా ధరావత్ లింగ్యా, రామన్నగూడెం గ్రామ అధ్యక్షుడిగా ఇన్నా శోభన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎల్లం లింగమల్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కేలోత్ సత్తమ్మభిక్షపతినాయక్, నాయకులు పేరం రాము, అనిల్‌రావు, రామోజీ, భారత శ్రీనివాస్, వెంకటేశ్వర్ రావు, మదుసూధన్, అందెయాక్యయ్య, రమేశ్, రాజిరెడ్డి, సోమరాములు, విజయమ్మ, వీరన్ననాయక్, సంపత్‌రావు, ఎంపీటీసీ యాదమ్మ, మేకల రమేశ్ యాదవ్, లింగన్న యాదవ్ పాల్గొన్నారు.

చిలుపూరు మండలంలో..
చిలుపూరు : చిలుపూరు మండల పరిధిలోని 17 గ్రామాల్లో టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షులను ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య శుక్రవారం రాత్రి ప్రకటించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు పోలెపల్లి రంజిత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ చిలుపూరు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మాచర్ల ప్రవీణ్, చిన్నపెండ్యాల అధ్యక్షుడిగా గుంటి భీముడు, దేశాయితండా అధ్యక్షుడిగా భూక్యా సుందర్, ఫత్తేపూర్ గ్రామ అధ్యక్షుడిగా గుగులోతు శంకర్, గార్లగడ్డతండా అధ్యక్షుడిగా మాలోతు బీమా, కొండాపూర్ గుల్లా ప్రకాష్, కృష్ణాజిగూడెం అధ్యక్షుడిగా సాదం మల్లేశ్, లింగంపల్లి గ్రామ అధ్యక్షుడిగా గంగుల సంపత్‌రెడ్డి, మల్కాపూర్ అధ్యక్షుడిగా పెనుకుల రాజు, నష్కల్ అధ్యక్షుడిగా మోడెం వేమన, పల్లగుట్ట అధ్యక్షుడిగా చల్లారపు రాజేందర్, రాజవరం గ్రామ అధ్యక్షుడిగా రంగు రవి, శ్రీపతిపల్లి అధ్యక్షుడిగా మోతె సురేష్, తీగలతండా గ్రామ అధ్యక్షుడిగా బదావత్ వెంకన్న, వంగాలపల్లి ఆకారపు యాకయ్య, వెంకటాద్రిపేట గ్రామ అధ్యక్షుడిగా ముక్కెర వలేందర్‌రెడ్డి, వెంకటేశ్వరపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా తోకల గోపాల్‌రెడ్డిను ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ప్రకటించినట్లు రంజిత్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా అనుబంధ కమిటీలను త్వరగా ప్రకటించనున్నామని, ఆయా గ్రామాల పార్టీ నాయకులు అనుబంధ సంఘాలకు చెందిన పేర్లను తెలియజేయాలన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles