ఆ ఎంపీడీవో మాకొద్దు..

Sat,August 10, 2019 03:55 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 09 : : గతంలో ఎంపీడీవోగా పనిచేసిన కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బచ్చన్నపేట ఎంపీడీవో పీ అనితను తమ మండలానికి బదిలీ చేయొద్దని శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఓజే మధు, జెడ్పీ సీఈవో రమాదేవిని చిలుపూర్ ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత ఆధ్వర్యంలో పలువురు ఎంపీటీసీలు కలిసి కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అనేక అక్రమాలకు పాల్పడి, ఆర్ధిక లావాదేవీలలో తలదూర్చిన సంఘటనలు మళ్లీ పునరావృతమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ మండలానికి బదిలీ చేసిన ఎంపీడీవో అనితను తాము తిరస్కరిస్తున్నట్లు చిలుపూర్ మండలానికి చెందిన ఎంపీటీసీలు చేసిన ఏకగ్రీవ తీర్మానం ప్రతిని జేసీ, సీఈవోకు అందజేశారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles