సామాజిక సేవల్లో లయన్స్ ముందంజ

Sat,August 10, 2019 03:54 AM

-జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి
జనగామ టౌన్, ఆగస్టు 09: సామాజిక సేవల్లో జిల్లా వ్యాప్తంగా లయన్స్ క్లబ్‌లు ముందంజలో ఉన్నాయని జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. జనగామ ప్లాటినం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం రాత్రి జనగామ విజయ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. డీసీపీ శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జనగామలో లయన్స్ క్లబ్‌ల సంఖ్యకు అనుగుణంగా సభ్యులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యశిబిరాలు, వృద్ధులకు దుప్పట్లు, పంపిణీ, నేత్రదానం వంటి తదితర కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తుందని క్లబ్‌ల సేవలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా 320ఎఫ్ జిల్లా ఫస్ట్ గవర్నర్ టీ లక్ష్మీనరసింహారావు, ఆర్‌సీ డాక్టర్ సీహెచ్ రాజమౌళి నూతన కార్యవర్గ సభ్యులను ప్రమాణస్వీకారం చేయించారు.

ఇందులో ప్లాటినం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా డాక్టర్ కొడిమాల అంజిరెడ్డి, ప్రధానకార్యదర్శిగా మోర్తాల ప్రభాకర్, కోశాధికారిగా అలిసేరి శ్రీనివాస్‌తోపాటు కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఈ మేరకు నూతన కమిటీని డీసీపీ శ్రీనివాసరెడ్డి అభినందిస్తూ మెరుగైన సేవలను అందించాలన్నారు. అనంతరం నూతక కమిటీ బృందం డీసీపీని ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెండో గవర్నర్ ముచ్చా రాజిరెడ్డి, పూర్వగవర్నర్ కే అంజయ్య, అడిషనల్ జిల్లా క్యాబినెట్ కార్యదర్శి కన్న పరశురాములు, జెడ్‌సీ చంద్రగిరి శ్రీనివాస్, యాదగిరి, గంగిశెట్టి ప్రమోద్‌కుమార్, టీ కృష్ణారెడ్డి, కృష్టజీవన్‌బజాజ్, కాముని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles