గుంతల పూడ్చివేత

Sat,August 10, 2019 03:54 AM

చిలుపూరు, ఆగస్టు 09 : మండలంలోని చిన్నపెండ్యాల గ్రామ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రోడ్డుపై ఉన్న గుంతలను సర్పంచ్ మామిడాల లింగారెడ్డి శుక్రవారం పూడ్చివేయించారు. చిలుపూరు వేంకటేశ్వరస్వామి ముఖద్వారం వద్ద రోడ్డుపై వర్షానికి గుంతలు పడగా సర్పంచ్ శుక్రవారం నాలుగు ట్రాక్టర్లతో గుంతల్లో మట్టిని పోయించి చదును చేయించారు. అలాగే నష్కల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుపై గుంతలను మట్టితో పూడ్చివేయించామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఇల్లందుల సుదర్శన్, భూక్యా రమేష్‌నాయక్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles