చీటూరును అభివృద్ధి చేస్తాం డిస్కం డైరెక్టరు మోహన్‌రెడ్డి

Sat,August 10, 2019 03:53 AM

లింగాలఘనపురం: మండలంలోని చీటూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని డిస్కం డైరెక్టరు మోహన్‌రెడ్డి చెప్పారు. మండలంలోని చీటూరును విద్యుత్ అధికారులు దత్తత తీసుకున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఐల మల్లేశం , ఎస్‌ఈ మల్లికార్జున్, డీఈ మంచూర్‌నాయక్, ఏడీ అర్జున్ పవార్, ఏఈ మధు, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles