పేదరికం అభివృద్ధికి అడ్డుకాకూడదు..

Fri,July 19, 2019 03:26 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ : విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుతూ ప్రతిభా వంతులుగా ఎదగాలని, పేదరికం, సౌకర్యాల లేమి అభివృద్ధికి అడ్డుకాకూడదని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. గురువారం మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో అమరజీవి మంతెన నారాయణరెడ్డి స్మారకంగా నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ శిలాఫలాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ నారాయణరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ తన కుమారుడు అజయ్‌రెడ్డి ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. ప్రతీ ఒక్కరు నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలను ఆధునీకరించి, అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయానికి అన్ని రకాల పుస్తకాలను అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్‌రావు, సర్పంచ్ అజయ్‌రెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles