రేషన్ పక్కదారి..

Fri,July 19, 2019 03:26 AM

నర్మెట : రాష్ట్రప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర సరుకులను అందిచేంచేందుకు ఏర్పాటుచేసిన పౌరసరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న సరుకులు అక్రమంగా పక్కదారిన పట్టి బడా వ్యాపారుల చెంతకు వెళ్తున్నాయి. జనగామ జిల్లా నర్మెట మండలంలోని హన్మంతపూర్‌లో రేషన్ డీలర్ సరుకులు మాయం కావడమే ఇందుకు నిదర్శంగా నిలిస్తుంది. సివిల్ సప్లయ్ అధికారి కాశెట్టి హరిప్రసాద్ తెలిపిన ప్రకారం.. జాయింట్ కలెక్టర్ ఓజే మధు మంగళవారం నర్మెట మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం హన్మంతపూర్ గ్రామంలోని బైరగాని అంజురా(అలియాస్ కవిత) రేషన్ దుకాణం క్రమసంఖ్య ఎనిమిదిలో తనిఖీచేశారు. కాగా తనిఖీల్లో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 30 లీటర్ల కిరోసిన్, గన్నీ సంచులు రికార్డుల ప్రకారం లేకపోవడంతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పరిశీలించిన సివిల్ సప్లయ్ అధికారులు మాయమైన సామగ్రిపై సరైన ఆధారలు చూపకపోవడంతో డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసి జేసీకి నివేదిక అందించినట్లు అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు ఆ రేషన్ డీలర్‌పై వేటు వేసే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.

8 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారి కాశెట్టి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ సంఘటన మండలంలోని ఆగపేట గ్రామ శివారులో గురువారం జరిగింది. సివిల్ సప్లయ్ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ హరిప్రసాద్ తెలిపిన ప్రకారం.. యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన భూక్య రవి, మాలోత్ నర్సింహులు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి యాదాద్రి జిల్లా కేంద్రానికి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా ఆగపేట శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా పట్టుపడ్డారు. దీంతో సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం అందిచండంతో 8 క్వింటళ్ల రేషన్ బియ్యంతో పాటు రెండు టాటా ఏసీ వాహనాలను సీజ్ చేసి, వారిపై కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లయ్ అధికారి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. విజిలెన్స్ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నా ఈ దందా కొనసాగుతోందని ఆయన వివరించారు. కాగా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles