సాంఘిక సంక్షేమ గురుకులంలో వెల్‌కమ్ పార్టీ

Fri,July 19, 2019 03:26 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్ : మండలంలోని పల్లగుట్ల క్రాస్‌రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాల, కళాశాలలో గురువారం నూతన విద్యార్థులకు వెల్‌కమ్ పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి క్రమశిక్షణ కలిగి, విద్యను అభ్యసించాలన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫిలితాలు సాధించేలా కృషి చేయాలని కోరారు. విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శన అలరించింది. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ శరత్‌బాబు, అధ్యాపకకులు జయేందర్, శంకర్, శ్రీకాంత్, హిమాద్రి, సుధాకర్, యాదగిరి, సారంగపాణి, నవత, ఉమారాణి, రజిత, పీడీ శ్రీనివాస్, పీఈటీ రాజు, డీఆర్ పవన్ పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles