ఘనంగా నెల్సన్ మండేలా 95వ జయంతి

Fri,July 19, 2019 03:26 AM

జనగామ టౌన్ : నెల్సన్ మండేలా 95వ జయంతిని గురువారం జనగామ కారాగారంలో మానవ హక్కుల క్లబ్(హెచ్‌ఆర్సీ) పారా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్‌ఆర్సీ రీజనల్ కో-ఆర్డినేటర్ జేరిపోతుల పరశురామ్ అధ్యక్షత వహించగా జైలర్ ఉపేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దక్షణాఫ్రికాలో నల్లజాతిపై చూపే వివక్షతకు వ్యతిరేకంగా శాంతి, సాంఘికన్యాయం కోసం నెల్సన్ మండేలా పోరాడాడన్నారు. ఇందుకు 27 ఏళ్లు జైలు శిక్షను అనుభవిస్తూ జైలులోనే ప్రపంచ రాజ్యాలన్నీ ఆకట్టుకునేవిధంగా చరిత్రాత్మక ఉపన్యసాలు ఇచ్చేవారని, ఇలా ఎన్నోరకాల ఉద్యమాలు చేపట్టి నెల్సన్ భారతరత్నను పొందారని ఆయన పోరాటాలను కొనియాడారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్సీ గైడ్ టీచర్ సుచరిత, సభ్యులు భువనేశ్వరి, సమీర, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles