అర్హులందరికీ ఇండ్లు..

Tue,July 16, 2019 04:40 AM

జనగామ రూరల్/బచ్చన్నపేట : అర్హులైన పేదవారందరికీ ప్రభుత్వం తరుపున డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించి అందిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. సోమవారం జనగామ మండలంలోని ఎల్లంల, పెద్దరాంచర్ల, బచ్చన్నపేట మండలంలోని అంజయ్యనగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదవారికోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జనగామ నియోజకవర్గంలో ఇప్పటికే 2500 ఇండ్లు నిర్మిస్తున్నామని త్వరలో ప్రతీ గ్రామంలోని పేదలకు ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడుతామన్నారు. కరువుగడ్డ అయిన జనగామకు కాలువల ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నామని త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు చనిపోయిన వారి పేరిట ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసులు వేసి ప్రాజెక్టులను, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎమ్మెలేయ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. వారి హయాంలో కనీసం తాగునీరు అందించేందుకు తగిన చొరవ తీసుకోలేదని, అలాంటిది నేడు రైతుల పొలాలు గోదావరి జలాలతో పచ్చగా కనబడితే కండ్లు మండుతున్నాయని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో తమ ఉనికి కోల్పోతామనే నాయకులు అడ్డుతగులుతున్నారన్నారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులు కేంద్రంతో చర్చలు జరిపి కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేందుకు కృషిచేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచించారు. మండలంలోని ఎల్లంల, పెద్దరాంచర్ల, గానుగుపహాడ్‌తో పాటు పలు గ్రామాల్లో డబుల్‌బెడ్‌రూం పనులను త్వరలో ప్రారంభించి నిర్మాణాలు చేపడుతామని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు దోచుకుని తెలంగాణను పీల్చి పిప్పి చేసిన సీమాంద్రుల నుంచి విముక్తి చేసిన సీఎం కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూపాయి కేటాయించలేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. అప్పడు, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చే నిధుల వాటా ఎంతో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్రం కోసం ఏం చేస్తారో వెల్లడించాలన్నారు.

150కి పైగా చెక్‌డ్యాంలు కావాలి
భూగర్భ జలాలు అడుగంటిపోయిన నేపథ్యంలో నియోజకవర్గంలో 150కి పైగా చెక్‌డ్యాంలు మంజూరు కావాలని కోరామన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత అభివృద్ధికి సాగునీటి రంగాలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బచ్చన్నపేటలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డిని, వైస్ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మిని సర్పంచ్ మల్లాడ్డి సన్మానించారు. ఎల్లంల, పెద్దరాంచర్లలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ ఆర్ వెంకటేశ్వర్‌రావు, ఎంపీపీ మేకల కళింగరాజుయాదవ్, జెడ్పీటీసీ నిమ్మతి దీపిక, ఏఈ బచ్చు శ్రీనివాసరావు, సైట్ ఇంజినీర్ ఎన్ బాబురావు, సర్పంచులు ఎర్ర సుజాత, ఏళ్ల సుజాత, ఎంపీటీసీ బండ లక్ష్మీవెంకటేశం, కొమ్ము సుజాత, నీటి సంఘం చైర్మన్ జనగాం వీరెందర్‌రెడ్డి, నాయకులు వల్లాల మల్లేశం, దూవునూరి చంద్రయ్య, బక్క శ్రీను, కొంతం వెంకటేశం, ఏళ్ల సంతోష్‌రెడ్డి, రాంరెడ్డి, నరేందర్, మహిపాల్, వేణు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బచ్చన్నపేటలోని అంజయ్యనగర్‌లో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మిఅంజయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, ఎంపీటీసీలు నల్లగోని పుష్ప, ఆల్వాల రాధ, బావండ్ల కృష్ణంరాజు, నరేందర్, ఉపేందర్‌రెడ్ది, నరెడ్ల బాల్‌రెడ్డి, గంగం సతీశ్‌రెడ్డి, షబ్బీర్, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, బాబు, వినోద్, గణపురం ఆనంద్, భిక్షపతి, వేముల బాలరాజు, కొండ హరికృష్ణ, దస్తగిరి, మహేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో మాధవి, పీఆర్ ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిని జీర్ణించుకోలేక విమర్శలు
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కోట్లు వెచ్చించి శాశ్వత పథకాలు, ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు, పలు పార్టీల నాయకులు జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని విమర్శిస్తునానరని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.కోట్లలో డబ్బు వెళ్తోంది. అయినా తెలంగాణకు కేంద్రం ఇచ్చింది మాత్రం శూన్యమన్నారు. ఇక కాంగ్రెస్ అరవై ఏండ్లకు పైగా పాలించి ప్రజల ఆస్తులను దోచుకుని, కుంభకోణాల్లో ఇరుక్కుపోయిందన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నూకలు చెల్లాయని తెలుసుకుని అలిసి పడిపోయిందని, ఇక లేవడం కష్టతరమన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles