అంతర్‌జిల్లా బైక్ దొంగల ముఠా అరెస్ట్

Tue,July 16, 2019 04:40 AM

జనగామ టౌన్, జూలై 15: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలుబైక్‌ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను జనగామ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి ఆరు బైక్‌లు, నాలుగు ట్రాక్టర్ల బ్యాటరీలను సీజ్ చేసి, పట్టుబడిన ముగ్గురిని జ్యుడీషయల్ రిమాండ్‌కు తరలించినట్లు జనగామ ఏసీపీ ఎస్ వినోద్‌కుమార్, సీఐ మల్లేశ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం జనగామ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల జనగామలో బైక్‌లు చోరీలకు గురవుతున్నాయని ఠాణాకు ఫిర్యాదులు రావడంతో పోలీసులు అప్రమత్తమై బైక్‌దొంగల ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో ఒక వ్యక్తి పార్కింగ్ చేసిన బైక్‌ను దొంగలించి పారిపోతుండగా పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాంధీ సెంటర్‌లో బైక్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించగా పట్టుబడిన మూఠాను బైక్ దొంగలుగా గుర్తించి ముఠాలోని ముగ్గురు నిందితులు లింగాలఘణపూరం మండలానికి చెందిన యాట సుధాకర్, జనగామకు చెందిన సులేగాం రాఘవేందర్ అలియాస్ రాజు, కంది శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా ముగ్గురిపై జనగామ ఠాణాలో రెండు కేసులు, సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఠాణాలో ఒకకేసు, హైదరాబాద్ ఉప్పల్ ఠాణాలో ఒక కేసు, ఓయూ ఠాణాలో ఒక టి కేసులున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100కి డయల్ చేసి సమాచారం అందించాలని ఏసీపీ కోరారు. అదేవిధంగా జిల్లాలోని పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంట జనగామ సీఐ మల్లేష్‌యాదవ్, ఎస్సై రవికుమార్, కానిస్టేబుల్స్ కృష్ణా, సతీశ్, అనిల్, సురేశ్, వీరన్న ఉన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles