ఇంటికో ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి

Tue,July 16, 2019 04:39 AM

పాలకుర్తి రూరల్, జూలై 15: ఇంటింటికో ఇంకుడు గుంతను నిర్మించుకొని భూ గర్భ జలాలు పెరుగుదలకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు అన్నారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టాలన్నారు. జలమే ప్రగతికి ప్రాణాధారమన్నారు. నీటిని వృథా చేస్తే రేపటి తరానికి కన్నీరే మిగులుతుందన్నారు. నీటిని సంరక్షించి కరువును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సద్వినియోగం చేసుకుని ఇంకుడు గుంతలను నిర్మించాలన్నారు. మానవాళి మనుగడకు చెట్లే కీలకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హారితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలను విరివిగా నాటి వాటిని కాపాడుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే మండలంలోని గూడూరు, దర్దెపల్లి గ్రామాల్లో జలశక్తి అభియాన్ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, ఎంపీడీవో అశోక్‌కుమార్, ఎంఈవో బుస్సారి రఘూజీ, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ముస్కు రాంబాబు, మార్కెట్ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, ఎంపీటీసీ ఎడవెల్లి పురుషోత్తం, ఎండీ సర్వర్ ఖాన్, కమ్మగాని రమేశ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు వర్రె వెంకన్న, రాపాక విజయ్, ఎండీ అబ్బాస్‌ఆలీ, కమ్మగాని మధు, బెల్లి యుగేంధర్, పెనుగొండ రమేశ్, గాదెపాక ఎల్లయ్య, సీఏలు పెనుగొండ మంజుల, ఉపాధ్యాయులు అన్నవజ్జుల నర్సింహమూర్తి, రమేశ్, బ్రహ్మాండభేరి సోమనాథరాజు, పంచాయతీ కార్యదర్శి మనోహరస్వామి, వీరమనేని హనుమంతరావు, ఉప సర్పంచ్‌చంద్రబాబు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles