మండలకేంద్రానికో పార్టీ కార్యాలయం

Mon,July 15, 2019 02:01 AM

- 75 వేల సభ్యత్వ నమోదే లక్ష్యం
- ప్రతి ఒక్కరూ టార్గెట్ పూర్తికి కృషి చేయాలి
- కష్టపడిన వారికి తగిన గుర్తింపు
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


పాలకుర్తి రూరల్, జూలై 13: నియోజకవర్గంలోని ప్రతీ మండలకేంద్రంలో టీఆర్‌ఎస్ కార్యాలయం కోసం భవన నిర్మాణాలకు కృషి చేస్తానని, ఇందుకోసం స్థల సేకరణ చేయాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మండలకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామ్యూల్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావుతో కలిసి సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో 75 వేల సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే పాలకుర్తిని ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15వ తేదీలోగా సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాయపర్తి, పెద్దవంగర మండలాల్లో సభ్యత్వ నమోదును పెంచాలన్నారు.

50 వేల సభ్యత్వాలు పూర్తి
ఇప్పటికే నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. మరో 25 వేల సభ్యత్వాలను మంగళవారంలోగా పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలను పూర్తి చేయాలన్నారు. మందుల సామ్యూల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును పూర్తి చేసి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర జీసీసీ చైర్మన్ ధరావత్ మోహన్‌గాంధీ నాయక్, నియోజకవర్గ పరిశీలకుడు జన్ను జకారియా, దేవస్థానం చైర్మన్ వీ రాంచంద్రయ్యశర్మ, గుడిపుడి గోపాల్‌రావు, మధుకర్‌రావు, సాంబయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, వసుమర్తి సీతారాములు, నర్సింహానాయక్, తీగల దయాకర్, ఈదురు ఐలయ్య, ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, జినుగు అనిమిరెడ్డి, బస్వ మల్లేశం, జ్యోతి, తూర్పాటి చిన్న అంజయ్య, కొత్త జలేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాసరావు, కేలోతు సత్తమ్మ, మంగళంపల్లి శ్రీనివాస్, శ్రీరాం సుధీర్‌కుమార్, రంగు కుమార్, మాజీ ఎంపీపీ కర్నె సోమయ్య, పీ సోమేశ్వర్‌రావు, ఈ నర్సింహారెడ్డి, మేకపోతుల ఆంజనేయులు, చింత రవి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles