పోటెత్తిన బొగత..!

Mon,July 15, 2019 01:58 AM

- తరలివచ్చిన పర్యాటకులు
- సెల్ఫీలు, కేరింతలతో ఎంజాయ్

వాజేడు, జూలై 13: ఎటుచూసినా ఎత్తైన గుట్టలు. అందమై న పచ్చిక బయళ్లు. పరుగులు పెడుతూ వచ్చి యాభై అడుగుల ఎత్తునుంచి దూకే జలపాతం.. ఈ సుందరమనోహర దృశ్యాల ను చూస్తూ పర్యాటకులు ఆనంద పరవశంలో మునిగిపోతున్నా రు. వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జ లపాతానికి పర్యాటకులు శనివారం పోటెత్తారు. వేలాదిగా త రలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. ఛత్తీస్‌గఢ్ పాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ నయాగరా బొ గత జలపాతానికి వరద పెద్ద ఎత్తున వస్తున్నది. నీరు హొయలు పోతూ జలపాతం నుంచి కిందికి దూకుతోంది. శనివారం వీకెం డ్ కావడంతో పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 50 అడుగుల పైనుంచి నీరు కిందికి పోస్తుండడం, నీటి తుంపర్లు ఎగిసి పడుతుండడంతో పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు.

అక్క డ ఈతలు కొడుతూ సేదదీరారు. జలపాతం అందాలను చూ సేందుకు ఇతర రాష్ర్టాలతో పాటు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జలపాతం వ్యూ పాయింట్ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగారు. చిల్డ్రెన్స్ పా ర్క్‌లో ఆడిపాడారు. రెస్టారెంట్‌లో కుటుంబాలతో కలిసి భోజనాలు చేశారు. వరదనీరు జలపాతానికి పోటెత్తుతుండడంతో ప ర్యాటకుల రక్షణ కోసం రెస్క్యూటీం అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నది. బొగత గుట్ట పైన ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పలువురు పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ తీర్థప్రసాదాలు అందజేశారు. జలపాతానికి సుమారు 600వందలకు పైగా వాహనాలు రావడంతో పా ర్కింగ్ చేసే ప్రదేశం కిక్కిరిసిపోయింది. ఆదివారం పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles