దేవరుప్పులలో డివైడర్ పొడిగించాలి

Mon,July 15, 2019 01:56 AM

- హైలెవల్ వంతెన వరకు సెంట్రల్ లైటింగ్
- సాగునీరు అందించడమే లక్ష్యం
- మంత్రి దయాకర్‌రావు


దేవరుప్పుల, జూలై 13: మండలకేంద్రంలోని జనగామ-సూర్యాపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటును మరో కిలో మీటర్ పొడగించాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ఆయన సూచించారు. మండలకేంద్రం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రస్తుతం ఉన్న 700 మీటర్ల డివైడర్‌ను మరో కిలో మీటర్ అంటే.. పోలీస్‌స్టేషన్ నుంచి తిరుమల గార్డెన్ వరకు పొడగిస్తే ప్రమాదాలను నివారించొచ్చని జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్ట్ మేనేజర్ పాషాతోపాటు ఇతర అధికారులతో అన్నారు. ఇక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న దేవరుప్పుల గ్రామానికి వెళ్లే పంచాయతీరాజ్ రోడ్డును ఇరువైపులా విస్తరించి, వాగుపై ఉన్న హైలెవల్ వంతెన వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు అంచనాలను యుద్ధప్రాతిపదికన తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రతీ ఎకరాకు సాగునీరు..
ప్రతీ ఎకరాకు సాగునీరందించేందుకు ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని మంత్రి అన్నారు. వీటి ఫలితాలు రైతులకు చేరాలంటే కొద్ది సమయం పడుతుందన్నారు. మరో వైపు వర్షాభావ పరిస్థితుల వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు ఆటంకం కలుగుతోందన్నా రు. వీటన్నించిని అధిగమించి నిరవధికంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. దేవరుప్పు ల, ధర్మాపురం, కడవెండిలోని చెరువులకు నీరందాలంటే ప్రధాన కాల్వలకు ఓటీలు పెట్టి కాల్వలు తవ్వాలని, వీటని మంజూరు చేయించినట్లు మం త్రి వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాల్వలు లేకున్నా ఎప్పటిలాగే ప్రతీ చెరువును ఈ వానకాలం సీజన్‌లో నింపుతానని హామీ ఇచ్చారు.

దశల వారీగా పనులు
సాగునీరు అందించడమేకాక.. ప్రజలకిచ్చిన అనేక హామీలను దశల వారీగా అమలు చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని మంత్రి దయాకర్‌రావు అన్నారు. సొంత స్థలాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇతర అన్ని పనులు అమలు చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈదునూరి రమాదేవి, ఎంపీపీ బస్వ సావిత్రి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, గ్రంథాలయ సంస్థ జిల్లా సభ్యుడు కారుపోతుల భిక్షపతి, మండల నాయకులు పల్ల సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, టీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు చింత రవి, నాయకులు కృష్ణమూర్తి, కారుపోతుల యాదగిరి, తిరుమలేశ్, కిష్టయ్య, నర్సింహులు, సీతారాంపురం సర్పంచ్ రమేశ్, ఆలకుంట్ల యాదగిరి, బిళ్ల యాదవరెడ్డి, కారుపోతుల సందీప్ ఉన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles