తొర్రూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా

Mon,July 15, 2019 01:55 AM

- సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తా
-పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


పాలకుర్తి రూరల్, జూలై 13: తొర్రూరు పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై శనివారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు, వివిధ శాఖల అధికారులు, పట్టణ నాయకులతో సమీక్షించారు. రూ. 45 కోట్లతో చేపట్టాల్సిన పనులపై ప్రణాళికను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొర్రూరు పట్టణాన్ని సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని ఎర్రబెల్లి అన్నారు. రూ. 25 కోట్లతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రెండో విడత మంజూరైన రూ. 20 కోట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 25న శంకుస్థాపన చేస్తానన్నారు.

తాగునీటి సమస్య తలెత్తవద్దు
పట్టణంలో తాగునీటి సమస్య రాకుండా చూడా లని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం తొర్రూరు పట్టణాభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు చేసినందుకు టీఆర్‌ఎస్ పట్టణ నాయకులు మంత్రిని సన్మానించారు. సమీక్షలో మున్సిపాలిటీ కమిషనర్ గుండెబాబు, మిషన్ భగీరథ ఈఈ మల్లేశం, డీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్‌రెడ్డి, మండల ఇన్‌చార్జ్ గుడిపుడి మధుకర్‌రావు, నాయకులు డాక్టర్ సోమేశ్వర్‌రావు, జెడ్పీటీసీలు మంగళంపల్లి శ్రీనివాస్, రంగు కుమార్, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, కుర్ర శ్రీనివాస్, ఎం దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కర్నె సోమయ్య, మండల అధ్యక్షుడు వసుమర్తి సీతారాములు, ఆర్ శ్రీనివాస్, మాడ్గుల నట్వర్, బిజ్జాల అనిల్, జినుగు సురేందర్‌రెడ్డి, శామకూరి ఐలయ్య, ధరావత్ సోమన్న, ముద్దసాని సురేష్ పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles