గ్రామీణ యువత సినిమా రంగంలో రాణించాలి

Mon,July 15, 2019 01:53 AM

- సందేశాత్మక చిత్రాలను నిర్మించాలి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పాలకుర్తి రూరల్, జూలై 13 : గ్రామీణ యువత సినిమా రంగంలో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో తొర్రూరు ప్రాంతానికి చెందిన గట్టు నవీన్‌కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న శర పంజరం సినిమా పోస్టర్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ లఘు చిత్రాల దర్శకులకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తామన్నారు. సామాజిక స్పృహ, పలు సందేశాత్మక చిత్రాలను ప్రజలకు అందించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్‌ను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు, గుడిపుడి మధుకర్‌రావు, డాక్టర్ పీ సోమేశ్వర్‌రావు, మేరుగు మల్లేశం గౌడ్, ఆలువాల సోమయ్య, కస్తూరి పులేందర్, జినుగు సురేందర్‌రెడ్డి, రాజు, రణదీప్, అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, కుర్ర శ్రీనివాస్, జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, కల్వకోలన్ ప్రవీణ్‌రాజు, వసుమర్తి సీతారాములు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles