నీలాక్రమంలో భద్రకాళి

Fri,July 12, 2019 02:36 AM

మట్టెవాడ, జూలై 11: వరంగల్ నగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళీ శాకంబరీ మహోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని తిథికి అనుగుణంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రాష్ట్ర దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. మహోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం నిత్యాహ్నికం తదితర కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళీ శేషు శాకంబరీ మహోత్సవాల్లో జ్యోతిశ్శాస్త్రం ప్రకారం దశమి తిథికి ఆదిదేవుడు యముడు అని అట్టి తిథికి అనుగుణంగా దశమహావిద్యలోని కాళీ క్రమాన్ని అనుసరించి అమ్మవారిని నీలాక్రమంలో అలంకరించారు. ఈ క్రమంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మృత్యువు బాధించదని, దీర్ఝమైన ఆయుష్యును కలిగిఉంటారని ఆయన వివరించారు. సాయంత్రం అమ్మవారిని షోడశీ క్రమాన్ని అనుసరించి నిత్యాన్రిత్యాక్రమంలో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందని శాస్ర్తాలు చెపుతున్నాయని భద్రకాళీ శేషు తెలిపారు. గురువారం నిర్వహించిన హోమాఇత్యాది కార్యక్రమాలకు ప్రముఖ వ్యాపారవేత్త , భవితశ్రీచిట్‌ఫండ్స్, భువనసూర్యడెవలపర్స్ ఎండీ తాటిపెల్లి శ్రీనివాస్ ఉభయదాతలుగా వ్యవహరించారు.

అధిక నిధులు కేటాయిస్తాం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వారి వెంట వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ,వేదమంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి దంపతులకు అమ్మవారి శేషవస్ర్తాలను బహూకరించి మహాదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళీ శేషు మంత్రితో మాట్లాడుతూ సంవత్సరానికి రూ.రెండు కోట్ల ఆదాయం ఉన్న ఆలయం కేసిఆర్ అమ్మవారికి బంగారు కిరీటం పెట్టిన అనంతరం ఆలయం దినదిన ప్రవర్తమానంగా ఎదిగి ఆదాయం రూ.ఆరుకోట్లకు పెరిగిందని, టూరిజం దిశగా అడుగులు పడుతున్నాయని, ఈ దశలో ఆలయం చుట్టు మాడవీదులు నాలుగు వైపులా రాజగోపురాలు నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీలైనంత తొందరగా ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. కేసీఆర్ బాల్యమిత్రుడు కాళేశ్వరం ఆలయ చైర్మన్ బొ మ్మెర వెంకటేశం, వరంగల్ జోన్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నర్సింహులు పాల్గొన్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles