రైతులను రాజు చేయడమే సీఎం సంకల్పం

Fri,July 12, 2019 02:35 AM

తరిగొప్పుల : రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పమని, ఇందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం తరిగొప్పుల మండలంలోని అక్కరాజుపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే మండలంలోని బొంతగట్టునాగారం కాంగ్రెస్‌కు చెందిన సర్పంచు ఇర్మల్ల బాలమణి-రాజయ్య ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంనతరం మాజీ ఎంపీటీసీ సభ్యుడు జొన్నగొని కిష్టయ్యకు పితృవియోగం జరగగా దశదిన కర్మరోజు ఆయనను ఇంటివద్ద పరామర్శించి ఆయన కుటుంబసభ్యులకు ప్రాగఢ సానుభూతి తెలిపారు. తెలంగాణలో కాళేశ్వర గంగా పారుతుందంటే కేవలం సీఎం కేసీఆర్ పుణ్యమేనని కొనియాడారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి రూ.2 లక్షల బీమా వర్తింస్తుందని పార్టీ కార్యకర్తలు దీనిని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పింగిళి జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు ముద్దసాని వెంకట్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బీరెడ్డి జార్జిరెడ్డి, అర్జుల సంపత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, లింగం, తాళ్లపలి ్లపోషయ్య, కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, జొన్నగొని అంజయ్య, సుదర్శనం, శ్రీనివాస్, కుర్రె మల్లయ్య, రామరాజు, బీమయ్య, నంద్యానాయక్, వీరేందర్, సత్తయ్య, రాజు, రవి, సంపత్, సుధాకర్ పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles