జనగామకు చేరిన టీటీడీ ప్రచార రథం

Wed,July 10, 2019 01:17 AM

-నేడు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం
జనగామ టౌన్, జూలై 09: టీటీడీ ఆధ్వర్యంలో బుధవారం జనగామలోని పాతబీట్‌బజార్‌లో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామదాసు భజన మండలి రాష్ట్ర అధ్యక్షుడు మన్యపు సిద్దేశ్వర్ తెలిపారు. మంగళవారం టీటీడీ ప్రచార రథం జిల్లా కేంద్రానికి చేరుకోగా జనగామ వాసులు ప్రచార రథానికి ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు జనగామలోని నెహ్రూపార్క్ సెంటర్ గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జనగామలో కల్యాణ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పాతబీట్ బజార్‌లో నేడు సాయంత్రం 6గంటలకు శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తును కల్పించాలని కల్యాణ నిర్వాహక కమిటీ సభ్యులు జనగామ డీసీపీ, ఏసీపీ, సీఐకి వినతి పత్రాన్ని అందించారు. కాగా రామిని రాజేశ్వర్, పజ్జురి గోపయ్య, పోకల లింగయ్య, మహాంకాళి హరిశ్చంద్రగుప్తా, బిజ్జాల శ్రీకాంత్, మల్లేషం, వేణు, శేఖర్, రజు, మధు, రమేశ్ తదితరులు పాల్గొనారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles