సేంద్రియ వ్యవసాయంతోనే రైతులకు మేలు

Wed,July 10, 2019 01:17 AM

పాలకుర్తి రూరల్ : సేంద్రియ వ్యవసాయంతోనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారి(ఏడీఏ) రాధికరావు అన్నారు. మంగళవారం మండలంలోని తొర్రూరు గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ (ఆత్మ)సౌజన్యంతో బత్తోజ్ రమేశ్ అనే రైతు వరి పంటను ఆమె పరిశీలించారు.
ఈసందర్భంగా ఆమె రైతులకు శిక్షణనిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల కంటే సేంద్రియ ఎరువుల వినియోగంతోనే ఎక్కువ పంట వస్తోందన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని తెలిపారు. రైతులు అరుతడి పంటలపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు కోఆర్డినేటర్ గంట చంద్రయ్య, ఏవో చిలుకల రమాదేవి, సర్పంచ్ నాయిని మల్లారెడ్డి, ఏఈవోలు సంధ్య, సువర్ణ, కీర్తి, మహేశ్ రైతులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles