లక్ష సభ్యత్వాల నమోదే లక్ష్యం

Wed,July 10, 2019 01:16 AM

దేవరుప్పుల, జూలై 09 : పాలకుర్తి నియోజకవర్గంలో లక్ష టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ జన్ను జకారియా అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం క్రియాశీలక, సాధారణ సభ్యతాల పుస్తకాలు రెండో విడత గ్రామ కోఆర్డినేటర్లకు మండల సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి పేరం రాముతో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో లబ్ధిపొందిన కుటుంబాలు తమకు టీఆర్‌ఎస్ సభ్యత్వాలు కావాలని అడిగి తీసుకుంటున్నారన్నారు. ప్రతీ ఇంట్లో ఏదో ఒక లబ్ధిపొందిన వ్యక్తి ఉండడంతో లక్షల్లో సభ్యత్వాలు నమోదవుతున్నాయని జకారియా అన్నారు. మంత్రి దయాకర్‌రావు ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్లు నమోదు చేసుకుని రికార్డు సృష్టించగా, టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో అదే రికార్డు సృష్టించే లక్ష్యంతో ముందుకు పోతుందని ఆయన అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు చేయాలని ముందు అనుకున్నా, ఇప్పటికే ఈ లక్ష్యం పూర్తి కావడంతో మరో 50 వేలు చేసేందుకు అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్ శ్రేణుల ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారన్నారు. సభ్యత్వ నమోదులో దేవరుప్పుల, పాలకుర్తి మండలాలు ముందున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు తీగల దయాకర్, మనోహర్‌రావు, మండల నాయకులు సుందరరాంరెడ్డి, బస్వ మల్లేష్, యూత్ మండల అధ్యక్షుడు చింత రవి, పాలకుర్తి దేవస్థాన కమిటీ సభ్యుడు కొత్త జలేందర్‌రెడ్డి, రాంసింగ్, హనుమంతు, కిష్టయ్య, లక్ష్మణ్ తండా ఉపసర్పంచ్ వాంకుడోత్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles