ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ఉత్తమ ఫలితాలు

Thu,June 20, 2019 01:30 AM

జఫర్‌ఘడ్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని వరంగల్ రూరల్ ట్రైనీ కలెక్టర్ బాదావత్ సంతోశ్‌నాయక్ అన్నారు. మండలంలోని హిమ్మత్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి సంతోశ్‌నాయక్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంతోష్‌నాయక్‌తో పాటు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ గుజ్జరి స్వరూప, సర్పంచ్ తాటికాయల అశోక్, ఎంపీటీసీ ఎర్ర సతీశ్, తహసీల్దార్ వీరప్రకాశ్, ఎంఈవో రాజేందర్ కలిసి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశానికి పాఠశాల హెచ్‌ఎం రాచమల్ల నరేందర్ అధ్యక్షత వహించగా ట్రైనీ కలెక్టర్ సంతోశ్‌నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవం, అంకితభావం, ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బట్టీ పట్టే విధానం వల్ల భవిష్యత్‌లో విద్యార్థులు నష్టపోతారని అన్నారు. మండలంలోని సూరారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాను చదువుకున్నానని తెలిపారు. ఎంపీపీ గుజ్జరి స్వరూప మాట్లాడుతూ.. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని, అందుకు నిదర్శనం సూరారం ప్రభుత్వ పాఠశాలలో చదివిన ట్రైనీ కలెక్టర్ సంతోశ్ నాయక్ అని తెలిపారు.

ట్రైనీ కలెక్టర్‌కు సన్మానం..
వరంగల్ రూరల్ ట్రైనీ కలెక్టర్ బాదావత్ సంతోశ్ నాయక్‌ను ఎంపీపీ గుజ్జరి స్వరూప, రాజు దంపతులు, పాఠశాల ఉపాధ్యాయులు, సర్పంచ్ తాటికాయల అశోక్ తదితరులు ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల ఆవరణలో సంతోశ్‌నాయక్ మొక్కలను నాటారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ రడపాక సుదర్శన్, ఎంపీటీసీ యార నీలమ్మ, ఉపసర్పంచ్ సందీప్, ఎస్‌ఎంసీ చైర్మన్ సోమయ్య, పంచాయతీ కార్యదర్శి చైతన్య, హైస్కూల్ హెచ్‌ఎం రాజేందర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles