విద్యతోనే సమాజంలో గుర్తింపు

Thu,June 20, 2019 01:29 AM

పాలకుర్తి : విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని డీఈవో యాదయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా బుధవారం మండలంలోని చెన్నూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామూహిక అక్షరాభ్యాసంలో విద్యార్థులకు పలకలను అందజేసి అక్షరాలను దిద్దించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు చేర్పించి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తొలుత గ్రామంలో ప్రధాన వీధుల్లో బడిబాట ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు హెల్‌కిట్స్, పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో రఘూజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య, సర్పంచ్ పుస్కూరి పార్వతి రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీలు పుస్కూరి కళింగరావు, దొంతమల్ల విమల, ఎస్‌ఎంసీ చైర్మన్ యాకయ్య, అంజయ్య, నాజర్, మహేష్, పాఠశాలల ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles