వందశాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలి

Thu,June 20, 2019 01:29 AM

జనగామ, నమస్తే తెలంగాణ : స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా జిల్లాలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని, ఇందుకు గ్రామపంచాయతీ కార్యదర్శులు కీలకంగా పనిచేయాలని డీఆర్‌డీవో గూడూరు రాంరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్‌రావు అన్నారు. బుధవారం జనగామలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమం అమలు-ప్రగతిపై పంచాయతీ కార్యదర్శులు, మండల అభివృద్ధి అధికారులు, ఈవోపీఆర్‌డీలు, ఈజీఎస్ సిబ్బందితో డీఆర్‌డీవో, డీపీవో, ఎస్‌బీఎం జిల్లా అధికారి ఆర్ కరుణాకర్, డీఆర్‌డీఏ అదపు పీడీ వసంత, ఏపీడీ శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం, వాడకం 100 శాతం జరగాలంటే జీపీ కార్యదర్శులదే ప్రధానపాత్ర అని అన్నారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను జూన్ 30లోగా పూర్తిచేయించేలా జీపీ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు గ్రామాలవారీగా అందించాల్సిన నగదు ప్రోత్సాహకాలు ఎంత మేరకు పెండింగ్‌లో ఉన్నాయో, ఎన్ని మరుగుదొడ్లు ఏస్థాయి నిర్మాణంలో ఉన్నాయి?, అందుకు గల కారణాలు ఏంటి?, నిర్మాణ సామగ్రి, మేస్త్రీల కొరత వంటి అంశాలపై సమీక్షించారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles