సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Wed,June 19, 2019 01:28 AM

రఘునాథపల్లి, జూన్‌ 18: వర్షాకాలం సీజన్‌లో గొర్రెలు, మేకలకు సోకే వ్యాధ్యులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎం భిక్షపతి గొర్రెలకాపరులకు సూచించారు. మండలంలోని కోమల్ల, రఘునాథపల్లిలో మంగళవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ వర్షాకాలం సీజన్‌లో మేకలు, గొర్రెలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా నట్టల నివారణ మందులు వేయించాలని, మందులు వేయించడం వల్ల జీవాలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా బరువు పెరుగుతాయని సూచించారు. మండలకేంద్రంలో 89,929 గొర్రెలు, 11,505 మేకలకు, కోమల్లలో 2,261 గొర్రెలు, 125 మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగిస్తామని, కాపరులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి అశోక్‌రెడ్డి, డాక్టర్‌ కృష్ణ, జంగా రాజిరెడ్డి, సర్పంచ్‌ మంజుల, ఉపసర్పంచ్‌ మేలక మురళి, నాయకులు తాటికొండ వెంకటేశ్‌ యాదవ్‌, బంద కుమారస్వామి, అశోక్‌, బండి రాజు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles