భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి

Wed,June 19, 2019 01:27 AM

-కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
జనగామ నమస్తే తెలంగాణ, జూన్‌ 18: జిల్లాలో వివిధ అవసరాల కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అడ్డంకులు ఎదురైతే వెంటనే తన దృషికి తేవాలని కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం భూసేకరణపై సంబంధిత విభాగం, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌ పనులపై మండలాల వారీగా తహసీల్దార్లతో సమీక్షించిన కలెక్టర్‌ కారణాలను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్‌కు గల కారణాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. సమీక్షకు పే అండ్‌ అకౌంట్స్‌ అధికారి కూడా తప్పనిసరి హాజరయ్యేలా చూడాలన్నారు. సీనియర్‌ అసిస్టెంట్‌ను పంపించడంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో జేసీ ఓజే మధు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుధాకర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మాలతి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీవోలు మధుమోహన్‌, రమేశ్‌, ఈఈలు, ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles