సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పెద్దపీట

Tue,June 18, 2019 12:37 AM

-రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ రమణారెడ్డి
-పడమటికేశ్వాపూర్‌లో గొర్ల్ల దాణా పంపిణీ
బచ్చన్నపేట : అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పడమటి కేశ్వాపూర్‌లో గొర్లకు ఉచితంగా దాణా సంచులను పంపిణీచేశారు. పశువైద్యాధికారి రామారావు ఆధ్వర్యంలో పడమటికేశ్వాపూర్‌తో పాటు నాగిరెడ్డిపల్లి సర్పంచ్‌లు రమేశ్‌, తాతిరెడ్డి భవానిశశిధర్‌రెడ్డి పాల్గొనగా ఇర్రి రమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గొర్ల పెంపకందార్లకు ఉచితంగా దాణా బ్యాగులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమంతో పాటు కేసీఆర్‌ సర్కార్‌, చేతి, కుల వృత్తుల బలోపేతానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వం గొల్ల, కురుమలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. యాదవులకు దశలవారీగా గొర్లు అందించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రూ.కోట్లు వెచ్చించి గొర్ల పంపిణీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో బాగంగానే గొల్ల కుర్మలకు దాణా, మందులు పంపిణీ చేయడం హర్షణీయమరి అన్నారు. మండలంలోని ఎనిమిది గ్రామాలకు రూ.41 లక్షలతో దాణా, మందులు మంజూరు చేసిందన్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలులో దేశంనే నంబర్‌వన్‌గా తెలంగాణను నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ముఖ్యంగా వేసవిలో మిషన్‌భగీరథ పథకం ద్వారా తాగునీరును ప్రభుత్వం సరఫరా చేయకపోతే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడేవారన్నారు. కోట్లు వెచ్చించి ప్రతీ ఇంటికి శుద్ధి చేసిన తాగునీరు అందించడం గర్హనీయమన్నారు. కార్యక్రమంలో గొర్లపెంపకందార్ల సంఘం గ్రామ అధ్యక్షుడు భైరి బాలమల్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు గిరబోయిన అంజయ్య, చల్లా శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles