22న జనగామలో మెగా జాబ్‌మేళా

Tue,June 18, 2019 12:37 AM

-ముత్తిరెడ్డి సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ
-వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించిన టీఆర్‌ఎస్‌ నేతలు
జనగామ, నమస్తే తెలంగాణ : కరువు ప్రాంతమైన జనగామ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముత్తిరెడ్డి సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22న జనగామలోని బీఎంఆర్‌ గార్డెన్‌లో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు సేవాసంస్థ వ్యవస్థాపకుడు నీల రాంమనోహర్‌ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, నూతనంగా ఎన్నికైన జనగామ జెడ్పీటీసీ నిమ్మతి దీపిక మహేందర్‌రెడ్డి, ఎంపీపీ మేకల కళింగరాజు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు పసుల ఏబేల్‌, మామిడాల రాజు, దామెర రాజు, ఏనుగుతల యాదగిరి, ఉల్లెంగుల సందీప్‌, ఎండీ తన్వీర్‌, చిన్నానాయక్‌తో కలిసి మెగా జాబ్‌ మేళా ప్రచార వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి రాంమనోహర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో టెన్త్‌, ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, డిగ్రీ, పీజీ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తిచేసి ఎంతోమంది ఉద్యోగ, ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగుల స్థితిగతులను అధ్యయనం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ప్రత్యేక చొరవతో హైదరాబాద్‌కు చెందిన 50కి పైగా మల్టీనేషనల్‌ కంపెనీల(ఎంఎన్‌సీ) సహకారంతో 22న(శనివారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముత్తిరెడ్డి సేవాసంస్థ, తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసువాలని కోరారు. జాబ్‌మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు ఉచిత ప్రవేశం కల్పించామని, మేళాకు హాజరయ్యే వారు బయోడేటా, 2 పాస్‌పోర్టు ఫొటోలు, అర్హత ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులతో హాజరుకావాలని కోరారు. ముత్తిరెడ్డి సేవాసంస్థ ప్రతినిధులు ఎండీ అన్వర్‌, అబ్బాస్‌, పండుగ నరేశ్‌, ఎక్కలదేవి సింహాద్రి, ఎజాజ్‌, శేఖర్‌, రంజిత్‌, సత్తిరెడ్డి, భాషిపాక ఎల్లేశ్‌, ఎండీ ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles