ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

Tue,June 18, 2019 12:37 AM

-డీఈవో యాదయ్య
రఘునాథపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని, ప్రతీ చిన్నారిని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈవో యాదయ్య అన్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో సోమవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డీఈవో యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హత కలిగిన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తారని అన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తారు తప్పా.. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండరని పేర్కొన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలపై మోజుతో తమ పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయొద్దని ఆయన అన్నారు. ఇప్పటికీ ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వారందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదిగారని, వారి స్ఫూర్తితో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పాఠశాలలో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, ఉచితంగా రెండు జతల దుస్తులు అందించడంతో పాటు పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో జయసాగర్‌, ఎంపీపీ దాసరి అనిత, వైస్‌ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్య, ప్రధానోపాధ్యాయుడు సీహెచ్‌ యాకయ్య, లయన్స్‌ క్లబ్‌ మండల అధ్యక్షుడు మార్కాల యాదిరెడ్డి, సభ్యులు సంతోశ్‌, లక్ష్మణ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్లు, అంగన్‌వాడీలు, విద్యార్థులు, సీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles