వినతులకు సత్వర పరిష్కారం చూపండి

Tue,June 18, 2019 12:36 AM

-వినతులు స్వీకరించిన జాయింట్‌ కలెక్టర్‌
జనగామ, నమస్తే తెలంగాణ : ప్రజావాణిలో భాగంగా ప్రతీ సోమవారం ప్రజల నుంచి వస్తున్న పలు దరఖాస్తులు, ఫిర్యాదులు, వినతులకు సత్వర పరిష్కారం చూపించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఓజే మధు జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు వ్యక్తిగత, సామూహిక సమస్యలపై దరఖాస్తుల రూపంలో ఆయనకు అందజేశారు. దరఖాస్తులు స్వీకరించిన ఆయన సమస్యలు వింటూ పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. గతవారం శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం ఏ దశలో ఉన్నాయి? అధికారులు ఏం చేశారన్న అంశాలపై ఒక్కో అధికారితో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన పేద ప్రజలకు అందేలా చూడాలన్నారు. కాగా, జిల్లాలో రానున్న వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమాచారమైనా వెంటనే అందించాలని ఆదేశించారు. ప్రజావాణిలో ఏవో విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles