యూపీహెచ్‌సీలో తనిఖీ

Tue,June 18, 2019 12:36 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ : మండల కేంద్రంలోని యూపీహెచ్‌సీ దవాఖానను సోమవారం మాతాశిశు సంరక్షణ రాష్ట్ర అధికారి(ఎంసీహెచ్‌) డాక్టర్‌ అశోక్‌కుమార్‌ తనిఖీచేశారు. ఈసందర్భంగా దవాఖాన ఆవరణలో పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం దవాఖానలోని రోజూవారి రోగుల రికార్డులు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా డాక్టర్‌ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ దవాఖానలో మౌలిక సదుపాయాలను కల్పించిందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, డాక్టర్లు రోగులను పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకునేలా, చేయించుకునేలా ఆశ వర్కర్లు కృషిచేయాలని అన్నారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసూతి పొందిన ప్రతీ బాలింతకు కేసీఆర్‌ కిట్‌ను అందించాలన్నారు. ప్రభుత్వ దవాఖనలో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలను కల్పించినందున గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు విస్తృత ప్రచారం చేయాలని కోరారు. డాక్టర్లు విధిగా సమయం ప్రకారం విధులు నిర్వర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మహేందర్‌, స్థానిక యూపీహెచ్‌సీ డాక్టర్‌ స్పందన, డాక్టర్‌ శ్రీవాణి, డాక్టర్‌ ప్రసన్నకుమార్‌, డాక్టర్‌ ఆనందరావుతో పాటు ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, ఆశవర్కర్లు, కొలనుపాక హరిప్రసాద్‌, జమాల్‌ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles