ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం

Mon,June 17, 2019 01:47 AM

లింగాలఘనపురం : కళ్లెం గ్రామాన్ని సమష్టి కృషితో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదామని కళ్లెం గ్రామ సర్పంచ్ తిప్పారపు వీరమ్మ పిలుపునిచ్చారు. ఈమేరకు గ్రామస్తులకు ఆదివారం ఆమె సొంత డబ్బులతో కొనుగోలు చేసిన కాగితపు సంచులను, ప్రతీ ఇంటికీ ప్లాస్టిక్ చెత్తబుట్టలను పంపిణీ చేశారు. అనంతరం హైస్కూల్ ఆవరణలో జరగిన కార్యక్రమంలో పాత జీపీ పాలకవర్గాన్ని, నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీని, వార్డుసభ్యులను, ఇటీవల రక్తదానం చేసిన గ్రామ రక్తదాతలను సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలు అధికంగా వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్ల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందన్నారు. అడవులు అంతరించిపోతుండడం వల్లే వానలు కురువక అనావృష్టి నెలకొంటుందోనని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతీ ఇంట్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంఈవో చంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ తాటిపాముల లావణ్య, నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ మార్పు కృష్ణవేణి, ఉపసర్పంచ్ శివరాత్రి మల్లేశం, తాటిపాముల రమేశ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles