నేడు వైద్యసేవల బంద్

Mon,June 17, 2019 01:46 AM

జనగామ టౌన్ : దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నిరసనగా జనగామ జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో సోమవారం వైద్యసేవలు బంద్ చేస్తున్నట్లు ఐఎంఏ కమిటీ సభ్యులు తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో వైద్యులపై జరిగిన దాడులను ఖండిస్తూ జనగామలో ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ.. సోమవారం ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు జిల్లావ్యాప్తంగా అన్ని రకాల వైద్యసేవలు నిలిపి వేస్తున్నట్లు పిలుపునిచ్చారు. అత్యవసర చికిత్సలు తప్పా మరే వైద్యసేవలు ఉండవని సూచించారు. కావున జిల్లాలోని ప్రజలు ఈ బంద్‌ను గమనించి వైద్యులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గోపాల్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్, డాక్టర్ సుగుణాకర్‌రాజుతో పాటు పలువురు వైద్యులు ఉన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles