ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం

Mon,June 17, 2019 01:46 AM

జనగామ టౌన్ ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఆదివారం జనగామలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ గంటా తిరుమల్, జనగామకు చెందిన ఆర్ శ్రీనివాస్, జీ సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు.. శివాజీకి పట్టాభిషేకం చేసిన రోజును హిందూ సామ్రాజ్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. యువకులంతా శివాజీని స్ఫూర్తిగా తీసుకొవాలని అన్నారు. కార్యక్రమంలో మహేశ్, దొంతుల శేఖర్, సోమిరెడ్డి, కేవీఎల్‌ఎన్ రెడ్డి, నాగరాపు వెంకట్, ఎల్లయ్య, పిట్టల సత్యం, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, భగవాన్‌రెడ్డి, నాగరాజు, ఫకీర్, యాదగిరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles