ఆర్‌ఎంపీలకు తెలంగాణ ప్రభుత్వం అండ

Mon,June 17, 2019 01:45 AM

-జెడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి
చిలుపూరు, జూన్ 16 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎంపీలకు అండగా నిలుస్తుందని జనగామ జిల్లా పరిషత్ చై ర్మన్ పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. చిలుపూరు మండల కేంద్రంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డిని చిలుపూరు, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్‌ఎంపీలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంపత్‌రెడ్డి మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో ఆర్‌ఎంపీలు కీలకంగా పనిచేశారని, వారి సేవలు మరవలేనివన్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలంతా నిరుపేద ప్రజలకు సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ దవాఖానలు ఉన్నప్పటికీ సకాలంలో గ్రామీణ ప్రజలకు అం దుబాటులో ఉంటూ ప్రాథమిక చికిత్స అందిస్తున్నారని, వారిని సేవలను కొని యాడారు. ఆర్‌ఎంపీల సం ఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడు తూ జనగామ జిల్లా కేంద్రం లో ఆర్‌ఎంపీలకు కమ్యూనిటీ హాల్ ని ర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరా రు. కార్యక్రమంలో చిలుపూరు, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల ఆర్‌ఎంపీల సం ఘం అధ్యక్షులు పేరాల చంద్రమౌళి, గుయ్య గట్టయ్య, ఆర్‌ఎంపీలు బత్తిని వెంకట్రాజం, వేముల వెంకటేశ్, రత్నాకర్‌రెడ్డి, ఉమాశంకర్, సంపత్‌రెడ్డి, శ్రీనివాస్, ప్రదీప్, వంగ సదానందం, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles