గ్రామాల్లో కప్పతల్లి ఆటలు

Mon,June 17, 2019 01:45 AM

లింగాలఘనపురం/దేవరుప్పుల/జఫర్‌ఘడ్, జూన్ 16 : కప్పతల్లి నీళ్లాడే, కడవనిండా నీళ్లొచ్చే వానదేవుడా.. అంటూ వాన పాటలు పాడుతూ.. వరుణుడు కరుణించి, వర్షాలు కురవాలని కోరుకుంటూ లింగాలఘనపురం మండలకేంద్రంలో, దేవరుప్పుల మండ లం నల్లకుంట తండాలతోపాటు మరికొన్ని గ్రామాల్లో, అలాగేజఫర్‌ఘడ్ మండలంలోని హిమ్మత్‌నగర్, తిడుగు, తిమ్మాపూర్‌లో చిన్నారులు కప్పతల్లి ఆటలు ఆడారు. రోకలికి నూతన వస్త్రంలో కప్పను బంధించి, పసుపు, కుంకుమలతో పూజించి పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు, బాలబాలికలు కప్పతల్లిని ఆహ్వానించి, బిందెలతో నీళ్లు తీసుకొచ్చి కప్పతల్లిని పూజించి.. వానలు సమృద్దిగా కురిపించమని వేడుకున్నారు. రైతులు, మహిళలు చిన్నారులపై, కప్పతల్లిపై కడివలతో నీళ్లు పోయడంతో చిన్నారులు ఆటలు ఆడు తూ, పాటలు పాడుతూ వానలు కురువాలని కోరుకున్నారు. చిన్నారుల ఆరాటానికి వరుణుడు కరుణించి, వర్షంగా కురియాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.కాగా లింగాలఘనపురంలో చిన్నారులు అశోక్, రాజు, ఎల్లే శ్, రమేశ్, రవి, మల్లేశం, నర్సింహులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles