తిమ్మాపూర్‌ ప్రాథమిక పాఠశాల సందర్శన

Sun,June 16, 2019 01:05 AM

జఫర్‌ఘడ్‌: మండలంలోని తిమ్మాపూర్‌ ప్రభుత్వ పాఠశాలను డీఈవో యాదయ్య సందర్శించారు. పాఠశాల ఆవరణ, తరగతి గదు లు, విద్యార్థుల నమోదు తదితర విషయాలను హెచ్‌ఎం మహేందర్‌ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులను పలు రకాలు ప్ర శ్నలు వేసి, వారి సామర్థాన్ని పరీక్షించారు. ఈ సందర్భంగా పాఠశా లకు విచ్చేసిన తల్లిదండ్రులు, విద్యా కమిటీ బాధ్యులు, గ్రామస్తుల ను ద్దేశించి మాట్లాడానేజ గ్రామస్తుల సహకారంతో మూసి వేయనున్న పాఠశాలకు పునర్‌ వైభవం తీసుకవావడం అభినందనీయమన్నారు. గత యేడాది విద్యార్థులు లేక మూత పడనున్న పాఠశాలకు విద్యా క మిటీ చైర్మన్‌ పొన్నాల నాగరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉపాధ్యాయులకు సహకారమందించి పాఠశాలలో విద్యార్థుల నమోదు ను పెంచినందుకు జిల్లా విద్యాశాఖ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్‌ పాఠశాలకు దీటుగా తరగతి గదులకు రంగులు వేయడం, ఆవరణ శుభ్రం చేయడం, పిల్లల నమోదును పెంచడం అభినందనీయమన్నారు. పాఠశాల అభివృద్ధికి విద్యా కమిటీ బాధ్యులు, గ్రామస్తులు చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమన్నారు. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన హెడ్‌ మా స్టర్‌ మహేందర్‌ను డీఈవో యాదయ్య అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles