ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

Sun,June 16, 2019 01:05 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌ నమస్తే తెలంగాణ జూన్‌15: ప్రభుత్వ పాఠశాలల్లోనే బాలబాలికలకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌ యాదయ్య అన్నారు. సహజ ఫౌండేషన్‌ -హైద్రాబాద్‌ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని తాటికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్‌ బుక్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో తరగతి గదులను పరిశీలించారు. అనంతరం హెచ్‌ఎం కౌడ రాజేందర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపి నోట్‌బుక్స్‌ తెప్పించిన టీచర్‌ కందాల రామయ్యను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహజ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు వీసంశెట్టి శైలజ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దాతల సహకారాన్ని స్వీకరించి చదువులో ముందుండి, భవిష్యత్‌లో స్థిరపడి సమాజసేవ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రైవేటుకు దీటుగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, సహజ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు శైలజ, ఎంఈవో జయసాగర్‌, ఎస్‌ఎంసీ చైర్మెన్‌ శ్రీనివాస్‌, టీచర్లు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles