అంగన్‌వాడీ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌

Sun,June 16, 2019 01:05 AM

లింగాలఘనపురం, జూన్‌ 15: మండలంలోని కుందారంలోని అంగన్‌ వాడీ కేంద్రాన్ని హైస్కూల్‌ అవరణలోకి మార్చాలని ఎంపీడీవో సురేందర్‌ కు కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. కుందారం గ్రామంలోని హైస్కూల్‌, అంగన్‌వాడీ సెంటర్‌లను కలెక్టర్‌ పరిశీలించారు. గతంలోనే అంగన్‌వాడీ సెంటర్‌ను హైస్కూల్‌ ఆవరణలోకి మార్చాలని చెప్పినా కార్యరూపం దాల్చక పోవడమేంటని ఎంపీడీవోను ప్రశ్నించారు. హైస్కూల్‌లో టాయ్‌లెట్లు నిర్మించాలని స్పష్టం చేశారు. ఆయన వెట ఎంపీడీవో సురేందర్‌, ఇన్‌చార్జి ఈవోపీఆర్డీ నాగేశ్వర్‌రావు, హైస్కూల్‌ హెచ్‌ఎం కృష్ణమూర్తి, పీఆర్‌ కార్యదర్శి మహేందర్‌, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు. కాగా, ఆయా శాఖలకు చెందిన వివరాలతో కూడిన రిపోర్టును ఎంపీడీవో సురేందర్‌ కలెక్టర్‌ కార్యాలయానికి రాత్రి వరకు అందించారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles