తరిగొప్పులలో గులాబీ గుబాళింపు

Sun,June 16, 2019 12:59 AM

తరిగొప్పుల, జూన్‌ 15: తరిగొప్పుల మండలంలోనూ గులాబీ గుబాలించింది. మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ సునాయాసంగా కైవ సం చేసుకుంది. ఎంపీపీగా పోలిపురం ఎం పీటీసీ, అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన జొన్నగోని హరిత, ఉపాధ్యక్షురాలిగా తరిగొప్పుల-2 ఎంపీటీసీ చెన్నూరి ప్రమీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో ప్రిసైడింగ్‌ అధికారిగా కొర్నేల్‌సన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉదయం 10 గంటలలోగా కో ఆప్షన్‌ మెంబర్‌గా మరియపురం గ్రామానికి చెందిన ఎరువ ఇన్నమ్మ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో మధ్యా హ్నం ఒంటి గంట తర్వాత ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ సభ్యులు అర్జుల మధుసూదన్‌రెడ్డి, ఎర్రోజు భిక్షపతి టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేయగా, కొన్ని గంటలపాటు ఉత్కంఠం నెలకొన్న ది.

అయితే ప్రయత్నం ఫలించకపోవడం తో వారిద్దరూ సమావేశం మధ్యలోనుంచి వెళ్లిపోయారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక స మయానికి ముందు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడి ్డ పాల్గొని ఎన్నికను పర్యవేక్షించారు. సాయంత్రం 3 గంటల తర్వా త ఎన్నికల అకారులు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం నామినేషన్లు ఆహ్వానించా రు. ఎంపీపీగా జొన్నగోని హరితను చె న్నూరి ప్రమీల సూచించగా తుపాకుల మంగ బల పర్చారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా చెన్నూరి ప్రమీలను జొన్నగోని హ రిత సూచించగా , తుపాకుల మంగ బలపర్చారు. దీంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఒక్కో నామినేషన్‌ రావడంతో ఎం పీపీగా హరిత, వైస్‌ఎంపీపీగా ప్రమీల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారి కొర్నేల్‌ సన్‌ ప్రకటించారు. అనంతరం వా రికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సమావేశంలో ఎంపీడీవో క్రిష్ణయ్య, టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు భూక్య జుమ్‌లాల్‌, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు
ఎంపీపీ, వైస్‌ ఎంపీపీగా టీఆర్‌ఎస్‌ ఎం పీటీసీలు హరిత, ప్రమీల ఏకగ్రీవంగా ఎ న్నికవడంతో టీఆర్‌ఎస్‌ మండల శ్రేణు లు సంబురాలు జరుపుకున్నారు. ఎన్నికల కేం ద్రం వద్ద చేరుకున్న పార్టీ శ్రేణులు ఫలితా లు ప్రకటించడంతో ర్యాలీగా స్థానిక చౌరస్తా వరకు వచ్చారు. చౌరస్తాలో పెద్ద ఎ త్తున పటాకులు కాల్చి, బతుకమ్మ ఆట ఆడి సంబరాలు చేసుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ సమన్వయకర్త గుజ్జ సంపత్‌రెడ్డి, జిల్లా నాయకులు అర్జుల సంపత్‌రెడ్డి, బీరెడ్డి జార్జిరెడ్డి, అర్జుల సుధాకర్‌రెడ్డి, ముద్దసాని వెంకట్‌రెడ్డి జె డ్పీటీసీ ముద్దసాని పద్మజారెడ్డి, మండల అధ్యక్షుడు పింగిళి జగన్‌మోహన్‌రెడ్డి, తాళ్లపల్లి పోషయ్య, చిలువేరులిం గం, శ్రీనివాస్‌, అంకం రాజారాం, సాయిల్ల రాజు, వంగ రామరాజు, రాంప్రసాద్‌, గొలుసుల రామరాజు, సంపత్‌, జయపాల్‌రెడ్డి, న ర్సింహులు, వెంకటేశ్‌, సారయ్య, సంజీవ, అంజయ్య, సుదర్శనం పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles