క్షయవ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలి

Sun,June 16, 2019 12:58 AM

పాలకుర్తి రూరల్‌ జూన్‌ 15: క్షయవ్యాధిని నివారించి క్షయరహిత సమాజానికి పాటుపడాలని వైద్యాధికారి యామిని అన్నారు. శనివారం మండల కేంద్రంలో క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణ చర్యలు వివరించారు. మూడు వారాలకు మించి దగ్గు ఉంటే పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్షయ రోగులకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులను పంపిణీ చేస్తామన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు దగ్గినా, తుమ్మినా చేతులు అడ్డుపెట్టుకోవాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, క్షయ వ్యాధి జిల్లా కో ఆర్డినేటర్‌ మధుశ్రీ, సుమన్‌, ఖయ్యూం, రాపోలు వేణు, మంజులారాణి, స్రవంతి, ఎంపీటీసీలు కమ్మగాని విజయ, పుష్పలీల డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles