గ్రామాల్లో జోరుగా బడిబాట

Sat,June 15, 2019 02:30 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌ నమస్తే తెలంగాణ/స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ జూన్‌14: ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శుక్రవారం బడడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇం దులో స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మండలంలో ని నమిలిగొండ, ఛాగల్లు, ఇప్పగూడెం తదితర గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రభు త్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యా హ్న భోజనం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లు పోగుల సారంగపాణి, డేగల ఉప్పలస్వామి, నాగరబోయిన మణెమ్మ, ప్రధానోపాధ్యాయులు రమేశ్‌, కొంరయ్య, అరుణ, ఉపాధ్యాయులు సుధాకర్‌, దూడయ్య తదితరులు పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు బడిబాట నిర్వహించగా ముఖ్య అతిథిగా స్ధానిక సర్పంచ్‌ టీ సురేశ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల శాతం పెంచేలా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో హెచ్‌ఎం ఆరుణకుమారి, అడికే సతీశ్‌, తిరుమలనాథ స్వామి దేవస్థానం చైర్మన్‌ కుంభం కుమారస్వామి, ఉప సర్పంచ్‌ నీల ఐలయ్య, వార్డు మెంబర్‌ గట్టు వెంకటస్వామి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గట్టు రమేశ్‌, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శివునిపల్లిలోలో నిర్వహించిన కార్యక్రంలో హెచ్‌ఎం ఎండీ తహసీన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదిరులు పాల్గొన్నారు.

జఫర్‌ఘడ్‌: మండలంలోని తమ్మడపల్లి(జీ) లో నిర్వహించిన బడిబాట ర్యాలీని ఎంపీపీ గుజ్జరి స్వరూప, సర్పం చ్‌ అన్నెపు పద్మ, ఎంపీటీసీ చిలువేరు శివయ్య ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ సమీపంలో విద్యార్థు లు మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈవో రాజేందర్‌ మాట్లాడుతూ సర్కారు పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో మెరుగైన విద్యాభోధన అందుతోందని, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హైస్కూల్‌ హెచ్‌ఎం దేవిక, పీఎస్‌ హెచ్‌ఎం సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కూ నూరు, హిమ్మత్‌నగర్‌, తిమ్మాపూర్‌, తిడుగు పాఠశాలల ఆ ధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కూనూరు పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల ప్రత్యేకతపై ప్రచురించిన కర పత్రాలను సర్పంచ్‌ ఇల్లందుల కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. హిమ్మత్‌నగర్‌లో సర్పంచ్‌ తాటికాయల అశోక్‌ హాజరై విద్యార్థుల నమోదు కార్యక్రమాలను చేయించారు.

పాలకుర్తి: బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని ఎంఈవో రఘూజీ కోరారు. అనంతనం స్థానికంగా జరిగిన సమావేశంలో ఎంఈవో బడిబాట షెడ్యూల్‌ను వివరించారు. 15న గూడూరు క్లస్టర్‌, 17న పాలకుర్తి, 18 న ముత్తారం, 19న చెన్నూరు పరిధిలోని పాఠశాలలో ర్యాలీ, ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలికల విద్య ప్రా ముఖ్యత, సామూహిక అక్షరాభ్యాసం, స్వచ్ఛ పాఠశాల, హరితహారం, పాఠశాల యాజమాన్య కమిటీ, బాల కార్మిక విముక్తి, పేరుతో ఐదు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అనంతరం బడిబాటకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పోతుగంటి నర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా మండలంలో తిరుమలగిరిలో ప్రా థమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట ర్యాలీని జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌మెంబర్‌ ఎండీ సర్వర్‌ఖార్‌, యాదగిరి, ఈర్ల రా జు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పాలకుర్తి రూరల్‌: బాల వికాస ఆధ్వర్యంలో బడీడు పిల్ల ల తల్లిదండ్రుల సమావేశాన్ని మండలంలోని రాఘవాపురం గ్రామంలోనిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ నల్లా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. బాల వికాస సంస్థ వారు పాఠశాల అభివృద్ధికి రూ.40వేలను విరాళం ప్రకటించారని, బెంచీలను విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. రాఘవపురం గ్రామాభివృద్ధికి బాల వికాస సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస సంస్థ డైరెక్టర్‌ సింగిరెడ్డి శౌరెడ్డి, పాలకుర్తి జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బాల వికాస ప్రతినిధులు ఎండీ శంషొద్ధీన్‌, కిరణ్‌, సుధాకర్‌, తిరుపతి, చెంచు కర్ణాకర్‌, నల్ల వసంత, రాగం కొంరెల్లి పూజారి సురేశ్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ సర్వర్‌ఖాన్‌ పాల్గొన్నారు.

చిలుపూరు : మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన బట్వాండ్లతండాలో బడిబాట ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం దారం శ్రీనివాస్‌తో పాటు టీచర్లు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. బడీడు పిల్లలను సర్కారు పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్ర భుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం రుచికరమైన భోజనం అందించడం జరుగుతుందన్నారు. ప్రతీ ఏటా దాతల సహకారంతో నోట్‌బుక్స్‌, పెన్నులు, టై, షూస్‌, వాటర్‌ బాటిల్స్‌ అందించనున్నట్లు తెలిపారు. అదే విధంగా శ్రీపతిపల్లి, ఫత్తేపూర్‌ గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెన్నయ్య, రాజ్‌కుమార్‌, దిలీప్‌కుమార్‌, రవీందర్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

కొడకండ్ల: మండలంలోని రామవరంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని సర్పంచ్‌ మందుల శిరీష ప్రారంభించారు. అనంత రం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో బాబాలికలకు మెరుగైన విద్య అందుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేదల పిల్లలే చదువుకుంటున్నారని, కొంతమంది ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపుతూ, పేదలమ ని ప్రభుత్వ సంక్షమ పథకాలను తీసుకుంటున్నారని, అ లాంటి వారి సంక్షేమ పథకాలను రద్దు చేస్తామన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్‌ శిరీష ఆమె కూతురును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించగా, ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఆంజనేయులు తన కుమారుడి ప్రైవేట్‌ పాఠశాలలో చదువు మాన్పించి, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా ఎంపీటీసీ చెంచు మణెమ్మ, పాఠశాలల హెచ్‌ఎంలలు సాయిరాంకుమార్‌, ముత్తయ్య, టీచర్లు జక్కుల ప్రభాకర్‌, ఆంజనేయస్వామి, మమత, సమ్మయ్య, వెంకన్న పాల్గొన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles