ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

Sat,June 15, 2019 02:30 AM

-ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌, జూన్‌ 14: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన మండలకేంద్రంలోని శివునిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హెచ్‌ఎం కే విజయ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన జరుగుతోందన్నారు. ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించి పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీలు జగన్మోహన్‌రెడ్డి, బేబి, రేఖ, సరోజ, జెడ్పీటీసీలు భూక్యా స్వామినాయక్‌, మారపాక రవి, పాఠశాల సెక్టోరియల్‌ అధికారి శ్రీనివాస్‌, సంయుక్తరాణి, ఎంపీటీసీ బూర్ల లతాశంకర్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌, ఎంఈవో జయసాగర్‌, పీఎస్‌ హెచ్‌ఎం తహసీన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గట్టు రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోగుల సారంగపాణి, సర్పంచ్‌ టీ సురేశ్‌కుమార్‌, నాయకులు ఆకుల కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం పాఠశాలకు చెందిన విద్యార్థిని ఏదునూరి శ్రావ్య ఎస్సెస్సీలో 9.3 జీపీఏ సాధించగా, విద్యార్థినితోపాటు తల్లిదండ్రులు రమేశ్‌, అనితను ఎమ్మెల్యే సన్మానించారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles