నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు పోతయ్‌

Sat,June 15, 2019 02:29 AM

జనగామ, నమస్తే తెలంగాణ, జూన్‌ 14: బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా జనగామను తీర్చిదిద్దేందుకు చేపడుతున్న స్వచ్ఛభారత్‌ మిషన్‌పై నిర్లక్ష్యం వహించే వారి ఉద్యోగాలు ఊడిపోతాయని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో శుక్రవారం స్వచ్ఛభారత్‌ మిషన్‌ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటికీ 6,083 మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉండడంపై ఆయన సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివరికల్లా 100 శాతం పూర్తి కావాలని ఆదేశించారు. ఇప్పటికే అనేకసార్లు సమీక్షించి ఆదేశించినా కొందరు అధికారులు, సిబ్బంది పనితీరులో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గ్రామాల వారీగా అందించాల్సిన నగదు ప్రోత్సాహకాలు ఎంత మేరకు పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని మరుగుదొడ్లు ఏ స్థాయి నిర్మాణంలో ఉన్నాయి? అందుకు గల కారణాలు ఏమిటి? నిర్మాణ సామగ్రి, మేస్త్రీల కొరత వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో గూడూరు రాంరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఎస్‌పీఎం అధికారి కరుణాకర్‌, రాజన్న, ఏపీడీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles