ఓపెన్‌ ఇంటర్‌, టెన్త్‌ ఫలితాల విడుదల

Sat,June 15, 2019 02:29 AM

న్యూశాయంపేట : తెలంగాణ సార్వ త్రిక విద్యాపీఠం హైదరాబాద్‌ వారిచే ఏప్రిల్‌/మే నెలలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నిర్వహించిన ఓపెన్‌ పదో తరగతి ఇంటర్మీడియట్‌ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, టాస్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరశర్మ విడుదల చేశారు. ఈమేరకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా డీఈవో నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్‌ శంకర్‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పదో తరగతిలో 17.03శాతం, ఇంటర్మీడియట్‌లో 34.97శాతం, వరంగల్‌ రూరల్‌ జిల్లా పదోతరగతిలో 58.99 శాతం, ఇంటర్మీడియట్‌లో 45.99 శాతం, మహబూబాబాద్‌ పదో తరగతిలో 30.91 శాతం, ఇంటర్మీడియట్‌ లో 38.09 శాతం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పదో తరగతి 64.99 శాతం, ఇంటర్మీడియట్‌లో 49.95 శాతం, జనగాం జిల్లా పదోతరగతిలో 37.15శాతం, ఇంటర్మీడియట్‌లో 51.89 శాతం ఉర్ణీత సాధించారని వారు తెలిపారు. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 19 నుంచి 28 వరకు మీసేవా, ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్‌ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. పదో తరగతికి రీకౌంటింగ్‌కు రూ. 100, రీవెరిఫికేషన్‌కు రూ.1000 ప్రతీ సబ్జెక్ట్‌కు, ఇంటర్మీడియట్‌కు రీకౌంటింగ్‌కు రూ.200, రీవెరిఫికేషన్‌కు రూ.600 ప్రతీ సబ్జెక్ట్‌కు చెల్లించాలని తెలిపారు. ఫలితాలను www.telanga naopenshcool.org వెబ్‌సైట్‌లో చూసుకోవాలన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles