మిస్టరీగా ప్రశ్నపత్రాల మిస్సింగ్..!

Thu,June 13, 2019 01:17 AM

వరంగల్ క్రైం, జూన్ 12: మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ నుంచి అదృశ్యమైన ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల మిస్టరీ సీసీటీవీ పుటేజీల చుట్టూ తిరుగుతోంది. పోలీస్‌స్టేషన్‌కు 13 బాక్స్‌లు చే రుకున్నట్లు రికార్డు కాగా, అందులో నుండి 2 బాక్స్‌లు కనిపించకుండా పోవడం వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటర్ బోర్డు అధికారులు పోలీస్ స్టేషన్‌కు 13 బాక్స్‌లు తరలించామని చెబుతున్నట్లే పోలీస్‌స్టేషన్‌లో వాటిని భద్రపరిచినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్ నుంచే బాక్సులు మా యమయ్యాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన అధికారులు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. కానీ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల బ్యాకప్ కేవలం 10 రోజు లు మాత్రమే ఉండ టం వల్ల ఎప్పుడో స్టేషన్‌కు చేరుకున్న ప్రశ్నాపత్రాల బాక్స్‌ల ఆచూకీ కనుక్కోవడం విచారణాధికారులకు తలనొప్పిగా మారినట్లుగా సమాచారం. హార్డ్ డిస్క్‌లో డాటాను రాబట్టడానికి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపి పుటేజీలను సేకరించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పది రోజుల బ్యాకప్ ఉన్న హార్డ్‌డిస్క్‌లో ఎప్పడో నమోదైన డాటాను ఎలా డౌన్‌లోడ్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కానీ సీసీ పుటేజీ వస్తే కానీ ప్రశ్నాపత్రాల అదృశ్యం వెనుక ఎవరు ఉన్నారనేది తేలుతుందని పోలీసులు పేర్కొంటున్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles