మంత్రి సహకారంతో అభివృద్ధి వేగవంతం

Thu,June 13, 2019 01:17 AM

కొడకండ్ల, జూన్12: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మండలంలోని పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం అవుతాయని రాష్ట్ర గిరిజన సహకార సంఘం చైర్మన్ దరావత్ మోహన్ గాంధీనాయక్ తెలిపారు. బుధవారం మండలంలోని గిర్రి తండా గ్రామ పంచాయతీలో సీడీఎఫ్ నిధులనుంచి సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ప్రారంభించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీనాయక్ మా ట్లాడుతూ గతంలో ఎన్నికల కోడ్ ఉన్నందున్న మం త్రి నిధులు మంజూరు చేసి నా పనులు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. ఇ ప్పడి నుంచి నూతన, పాత గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతాని ఆయన తెలిపారు. ప్రతీ పనిలో గ్రామ ప్రజలు భాగస్వాములై పల్లెలను ప్రగతి పథంలోకి తీసుకరావాలని గాంధీనాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో నూతన మండలాధ్యక్షురాలు, దారవత్ జ్యోతి రవీంద్ర గాంధీనాయక్, వైస్ ఎంపీపీ దీకొండ రమేశ్ గౌడ్, మైదం చెరువు గ్రామసర్పంచ్ మహేశ్ నాయక్, కనకదుర్గమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్ రాజేశ్‌నాయక్, ఉప సర్పంచ్‌లు నరేశ్, కిషన్ నాయకులు, గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు సురేశ్ నాయక్, వెంకన్ననాయక్, దూమా నాయక్, గోవింద్ నాయక్, కైక, సూర్య, రాజన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles