పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

Wed,June 12, 2019 01:43 AM

చిలుపూరు : ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి అన్నారు. మల్కాపూర్ గ్రామంలో గొర్రెల, మేకల షెడ్ల నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశానికి జిల్లా పశువైద్యాధికారి భిక్షపతి, సర్పంచ్ రవి, ఎంపీటీసీ కుసుమ రమ్య, పశువైద్యాధికారి రవికుమార్ హాజరుకాగా, కృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం గొర్రెలు, మేకలను సంరక్షించుకునేందుకు లబ్ధిదారులకు వందశాతం సబ్సిడీతో షెడ్లను మంజూరుచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజా ప్రయోజనాల కోసం ప్రవేశ పెట్టినవని వాటిని అర్హులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా పశువైద్యాధికారి భిక్షపతి మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన గొర్రెల పథకం సద్వినియోగం చేసేందుకు సన్న, చిన్నకారు రైతులకు రూ.82వేలతో నిర్మించుకునేందుకు మల్కాపూర్ గ్రామానికి 13 షెడ్లను మంజూరుచేసినట్లు తెలిపారు. గొర్రెలున్న రైతులకు మాత్రమే నిబంధనల మేరకు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 10,519యూనిట్లను లబ్ధిదారులకు అందించామని, రెండో విడతలో 2,223 యూనిట్లను అందించగా, మరో 3800 మంది రైతులు డీడీలు చెల్లించారన్నారు. త్వరలో వారికి అందించనున్నట్లు తెలిపారు. షెడ్ల నిర్మాణం ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తారన్నారు. అందుకు 100 శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. మల్కాపూర్‌ను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు, సత్వరంగా పనులను పూర్తి చేసినట్లయితే రెండో విడతగా మరిన్ని షెడ్లను మంజూరవుతాయన్నారు. ఎంపీడీవో కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి మాధవి, టీఏ విజయలక్ష్మి, ఈసీ సతీశ్, గ్రామ లబ్ధిదారులు కట్ట చేరాలు, కట్ట మల్లయ్య, చిమ్మ ఓదేలు, చేరాలు హాజరయ్యారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles